“90s” సీరీస్ లో శివాజీ చిన్న కొడుకుగా నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

“90s” సీరీస్ లో శివాజీ చిన్న కొడుకుగా నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

ఇటీవల రిలీజ్ అయిన ‘90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌ సిరీస్‌ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ చూసిన ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.

Video Advertisement

చాలా కాలం తరువాత నటుడు శివాజీ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌లో నటించిన నటి నటులందరికి మంచి గుర్తింపు దక్కింది. వీరిలో శివాజీ చిన్న కొడుకుగా నటించిన అబ్బాయికి మరింత గుర్తింపు లభించింది. దాంతో నెట్టింట్లో ఆ అబ్బాయి గురించి ఆరా తీస్తున్నారు. మరి ఆ అబ్బాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి లీడ్ రోల్స్ లో నటించిన ’90స్’ వెబ్ సిరీస్ జనవరి 4న ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలలో చక్కగా నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివాజీ చిన్న కొడుకు ఆదిత్యగా నటించిన బాల నటుడికి మరింత గుర్తింపు లభించింది.
90 s a middle class biopic streaming dateఆ అబ్బాయి పేరు రోహన్‌ రాయ్‌. రోహన్‌ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా బిల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ కోసం ఆడిషన్స్‌ కి తల్లితో పాటుగా వెళ్ళగా ‘చారు కేశ’ అనే పాత్రకు ఎంపిక అయ్యాడు. ఈ పాత్రలో నటించి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అడుగుపెట్టాడు. అలా రామ్‌ చరణ్‌, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’మూవీలో కనిపించాడు.
రోహన్‌ రాయ్‌ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారాడు. ఇక ’90స్’ వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో చదువు ఎక్కని ఆదిత్య క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వంతో కనిపిస్తూ, కామెడీతో నవ్విస్తూ, కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. రోహన్‌ పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/C12KvwWpS_B/?hl=en

Also Read: “దేవర” గ్లింప్స్ లో ఈ షాట్ గమనించారా..? ఏం ప్లాన్ చేసావయ్యా కొరటాల..?


End of Article

You may also like