Ads
ఉత్తర భారతదేశంలో జరుపుకునే ఒక ఆచారం కర్వా చౌత్. ఈ పండగ రోజు భార్యలు, తమ భర్తల కోసం ఉపవాసం చేస్తారు. ఆ రోజు సాయంత్రం చంద్రుడు వచ్చాక ఉపవాసం ఉన్న ఆడవాళ్ళు జల్లెడలో చంద్రుడిని చూసి, తరువాత వారి భర్తని చూస్తారు. అప్పుడు వారి భర్తలు, వారికి నీటిని తాగిస్తారు. ఈ ఆచారం ఎన్నో సంవత్సరాల నుండి పాటిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ ఆచారానికి సంబంధించి, డాబర్ కంపెనీ ఒక ఎడ్వర్టైజ్మెంట్ విడుదల చేసింది.
Video Advertisement
కానీ ఇది నెగిటివిటీ ఎదుర్కొంది. ఇందుకు కారణం ఏంటంటే, ఇందులో ఇద్దరు ఆడవాళ్ళు రిలేషన్ లో ఉన్నట్టు, వారిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉపవాసం ఉన్నట్టు చూపించారు. గత రెండు రోజుల క్రితం విడుదలైన ఈ ఎడ్వర్టైజ్మెంట్ సెన్సేషన్ సృష్టించింది. యూట్యూబ్, అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఎక్కడ చూసినా ఈ ఎడ్వర్టైజ్మెంట్ గురించే చర్చ జరిగింది.
ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు, కొన్ని సంఘాలు, “ఇలా చూపించడం తప్పు!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కొంత మంది నెటిజన్లు అయితే ఈ ఎడ్వర్టైజ్మెంట్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. “వారు కూడా మనుషులే” అని, “వారి ప్రేమ అందరి ప్రేమలాగే సహజమైనది” అని, “కాబట్టి వారు ఒకరి కోసం ఒకరు ఉపవాసం ఉండటం, ఆ విషయాన్ని చూపించడం వల్ల సమాజానికి ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంది” అని, ఇలాంటి ధైర్యమైన అడుగు వేసినందుకు డాబర్ వారిని అభినందిస్తున్నారు.
watch video :
Well done, Fem/Dabur!
A nice film for a traditional, often-criticized festival by an otherwise conservative brand. pic.twitter.com/gHBTca6jP8
— Abhishek Baxi (@baxiabhishek) October 22, 2021
End of Article