Ads
ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో. అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచింది.
Video Advertisement
టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా మరొక టీజర్ కూడా విడుదల అవ్వబోతోంది అని సమాచారం. దీపావళి రోజు మరొక టీజర్ విడుదల అవుతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై సినిమా బృందం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సినిమా మాత్రం ఖచ్చితంగా జనవరి 14 వ తేదీన విడుదల అవుతుంది అని టీజర్లో సినిమా బృందం చెప్పకనే చెప్పింది. అందరూ మళ్లీ ప్రభాస్ ని లవ్ స్టోరీ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
End of Article