Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
Video Advertisement
దాంతో ప్రేక్షకులు అందరూ ఆర్ఆర్ఆర్ టీజర్ ఎప్పుడు వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కి సంబంధించి ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే టీజర్ అక్టోబర్ 29వ తేదీన విడుదల అవుతుంది. అది కూడా డైరెక్ట్ గా యూట్యూబ్లో కాదు. ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా మీద మొదట టీజర్ ప్రదర్శిస్తారట. ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేస్తారు. టీజర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది అని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article