Ads
సాధారణంగా మనం ఇంటి పెరడులోకి వెళ్లాలంటే ఆ మొక్కల్ని చూసి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. పైగా పెరడులో మొక్కల వలన ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వీళ్ళ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటేనే అందరికీ హడల్. అదేమిటి అసలు ఇక్కడ ఏముంది..?, అంతలా ఏం వుంది..? వీటిని కనుక తెలుసుకోవాలంటే ఇప్పుడే ఆ పెరడు గురించి మనం చూద్దాం.
Video Advertisement
ఇంటి పెరడులోకి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో భయం. స్నానం చేయాలన్నా లేదంటే సరదాగా అలా వెళ్లాలన్నా కూడా భయపడిపోతారు. వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఉమారాణి, వెంకన్న కుటుంబంతో వుంటున్నారు. అయితే వీళ్ల పెరడు భయపెడుతోంది. వీళ్ళు ఇంటి పెరడులో ఒక అరటి చెట్టు ఉంది.
పైగా అరటి చెట్టుకి గెల కూడా వేసింది. అయితే అరటికాయలని కొయ్యడానికి వెళ్లిన ఉమాదేవి హఠాత్తుగా ఒక పిట్టను చూసింది. ఆమెకు వెంటనే జాలి కలిగింది. వెంటనే ఆ పక్షి గూడును తీసి పారేయకుండా అలానే ఉంచేసింది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ పిట్ట కాస్త అందులో గుడ్లు పెట్టేసింది. ఇంకేముంది ఈ జాలి పడ్డ ఉమాదేవికి చుక్కలు కనపడుతున్నాయి .ఆ పిట్ట కాస్తా దాంట్లో గుడ్లు పెట్టి పొదిగింది.
అరటి చెట్టు కిందకి వచ్చేయడంతో ఆమె గూడు ఎక్కడ పడిపోతుందా అని సరి చేయించింది. కానీ ఆ పిట్ట మాత్రం గూడుని పొడుస్తున్నారు ఏమో అని భయపడింది. పైగా అక్కడికి ఎవరైనా వెళితే చాలు పొడవడానికి వస్తోంది. వాళ్ల మీదకి రెండు పిట్టలు కూడా దాడి చేస్తున్నాయి. కళ్ళల్లో పొడిస్తే ఎక్కడ కంటికి ఇబ్బంది అవుతుందని హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నారు ఇంట్లో వాళ్ళంతా. దీనిని చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. పైగా ఆ గూడుని, పిట్టలు ప్రేమని చూసి పొడిచినా కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఆ ఇంటి సభ్యులు.
End of Article