Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాలోని సామీ సామీ అనే పాట ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది.ఈ పాటని దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచగా, తెలుగులో మౌనిక యాదవ్ పాడారు. ఈ పాట లిరికల్ వీడియో ఇవాళ విడుదల చేశారు.
Video Advertisement
అయితే ఈ పాట చూస్తే రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ పాట గుర్తొస్తోంది. ఈ ఒక్క పాట మాత్రమే కాదు. అంతకు ముందు పుష్ప నుండి విడుదల అయిన మిగిలిన రెండు పాటలు చూసినా కూడా రంగస్థలం సినిమానే గుర్తొస్తోంది. అందుకు ముఖ్య కారణం గ్రామీణ వాతావరణం ఉండడం. అలాగే రష్మిక పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర చూస్తే సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర గుర్తొస్తోంది. దాంతో సోషల్ మీడియా అంతా “ఈ పాట రంగమ్మ మంగమ్మ పాటని కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది” అంటూ మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
End of Article