Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
పునీత్ చెన్నైలో పుట్టారు. తనకి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబమంతా మైసూర్ కి వెళ్ళిపోయారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ గారు కన్నడ స్టార్ హీరో. పునీత్ తన తోబుట్టువులు అందరిలో చిన్నవారు. పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు.దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఇడియట్ సినిమా రీమేక్. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఫ్యాన్స్ అందరూ పునీత్ ని అప్పు, పవర్ స్టార్ అని పిలుస్తారు.
పునీత్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి డాన్సర్ అలాగే మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు. అయితే, పునీత్ రాజ్‌కుమార్ చేసిన ఒక పొరపాటు కారణంగా ఇలా జరిగింది అని వార్తలు వస్తున్నాయి. పునీత్ కి వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. ఒక్క రోజు కూడా వ్యాయామం చేయకుండా లేరు. పునీత్ వయస్సు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఈ వయసులో అంత కఠినమైన వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది అని అంటారు. అంతే కాకుండా, పునీత్ కి నిన్న రాత్రి గుండెలో కొంచెం నొప్పిగా అనిపించింది అని, ఆ నొప్పితోనే వ్యాయామం చేయడానికి వెళ్లారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. పునీత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
End of Article