Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
పునీత్ కి మన తెలుగు ఇండస్ట్రీ నటులతో కూడా చాలా మంచి స్నేహం ఉంది. జూనియర్ ఎన్టీఆర్, పునీత్ చాలా మంచి మిత్రులు. అలాగే పవర్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి మహేష్ బాబు అతిథిగా హాజరయ్యారు. వీరిద్దరూ మాత్రమే కాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, సూర్య వంటి నటులు కూడా పునీత్ కి మంచి స్నేహితులు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక పాట కూడా పాడారు. 2016 లో వచ్చిన ఈ సినిమా, అలాగే ఈ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇదే సినిమాలో పునీత్ తో కలిసి హీరోయిన్ కాజల్ కూడా ఒక పాట పాడారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు.
End of Article