Home Filmy Adda చనిపోయే రెండు రోజులు ముందు ఎన్టీఆర్ కి కాల్ చేసి శ్రీదేవి ఏం చెప్పిందో తెలుసా..?

చనిపోయే రెండు రోజులు ముందు ఎన్టీఆర్ కి కాల్ చేసి శ్రీదేవి ఏం చెప్పిందో తెలుసా..?

by Megha Varna

శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీ లో నటి శ్రీదేవి బాగా పాపులర్ అయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో శ్రీదేవి నటించి అత్యంత ప్రజాదరణ పొందారు. శ్రీదేవి మరణం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. శ్రీదేవి తన కూతురు చిత్రాన్ని చూడక ముందే మరణించారు. తన కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్లిన తర్వాత ఆ సినిమా విడుదల కాకుండానే శ్రీదేవి మరణించారు.

శ్రీదేవి మరణంతో అభిమానులు కృంగిపోయారు. ఏది ఏమైనా శ్రీదేవి సినిమాలు, శ్రీదేవి చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇది ఇలా ఉండగా సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీదేవి చనిపోతున్న రెండు రోజుల ముందు దుబాయ్ నుండి ఎన్టీఆర్ కి కాల్ చేసారు. అయితే ఎన్టీఆర్ కి ఆమె ఫోన్ చేసి ఒక రహస్యాన్ని చెప్పారని
ఎన్టీఆర్ వెల్లడించారు.

ఎన్టీఆర్ దీనిపై ఒక సందర్భంలో స్పందించడం జరిగింది. నటి శ్రీదేవి చనిపోవడానికి రెండు రోజుల ముందు తనకి కాల్ చేసిందని… కాల్ చేసి తనకి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అని చెప్పారు అని అన్నారు. అలానే జాన్వీకపూర్ త్వరలోనే తెలుగులోకి కూడా వస్తుందని..

NTR greatest actor in India, Sridevi voted best actress: survey | Bollywood News – India TV

నిజంగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది శ్రీదేవి కోరిక అని కూడా ఆమె చెప్పారు. మీ తాతగారు నేను అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించామని.. మీరు ఇద్దరూ కలిసి తెలుగు తెరపై నటిస్తే మా జంట గుర్తు వస్తుందని, జాన్వీ నీతోనే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని.. ఆమె అన్నారు. ఇలా ఎన్టీఆర్ కి శ్రీదేవి ఈ విషయాలు చెప్పిన రెండు రోజులకి శ్రీదేవి మరణించారు.

You may also like