Ads
సజ్జనార్ గురించి అందరూ విన్నాం. పోలీస్ ఆఫీసర్ గా తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని సీనియర్ ఐఏఎస్ అధికారిగా, అడిషనల్ డీజీపీగా కూడా పని చేసారు. ఇది ఇలా ఉంటే సజ్జనార్ ఇప్పుడు TSRCTC ఎండీగా తన మార్క్ ని చూపిస్తున్నారు. సజ్జనార్ తన బాధ్యతల పట్ల ఎంత స్ట్రిక్ట్ గా వుంటారు తెలుసు. అయితే ఇప్పుడు ఈయన ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి, ప్రయాణీకులకి మెరుగైన సేవలు అందించడానికి ఆయన కృషి చేస్తున్నారు.
Video Advertisement
గత కొంత కాలం నుండి చూసుకుంటే డీజిల్ మరియు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా ఆర్టీసీకి కూడా ఇది ఇబ్బందిగా మారింది. అయితే ఇలా పెరుగుతున్న ధరలని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఆదాయం ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచిస్తున్నారు సజ్జనార్.
ఆర్టీసీ వైపు ప్రయాణికుల్ని ఆకర్షించడానికి ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ ని తగిలించి అదిరే ఓ మీమ్ ని చేసి.. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లీటరు పెట్రోలు కంటే తక్కువ ధర లో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించ వచ్చని ప్రచారం చేయడం జరిగింది.
End of Article