Home Filmy Adda పవన్ తో రాజమౌళి సినిమా చెయ్యాలంటే కష్టమే..కారణం ఇదేనా..?

పవన్ తో రాజమౌళి సినిమా చెయ్యాలంటే కష్టమే..కారణం ఇదేనా..?

by Megha Varna

రాజమౌళి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ రేంజ్ లో వుంటాయని అందరికీ తెలుసు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా రాజమౌళి ఇస్తున్నారు. అయితే రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉన్నట్లు చెబుతున్నారు. మామూలుగా హీరోలు రాజమౌళి డేట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటారు.

మొదట విక్రమార్కుడు కథతో..

ఒకవేళ కనుక అవసరమైతే సినిమాని పక్కన పెట్టి మరీ డేట్ ఇస్తారు. ముఖ్యంగా నేటి తరం యువ హీరోలు అయితే రాజమౌళి కోసం ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా రాజమౌళి సినిమాలు చేయాలని ఎప్పటి నుండో అనుకున్నాడు. అయితే గతంలో విక్రమార్కుడు సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్ కి చెప్పాలని.. పవన్ కళ్యాణ్ తో తీస్తే బాగుంటుందని అనుకున్నారట.

Pawan Kalyan Birthday: 8 unknown facts about the Telugu Power Star that cannot be missed - IBTimes India

కానీ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కొంత బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ సినిమా చేయలేదట. ఈసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రత్యేకంగా కలవడం జరిగింది తప్పకుండా చేద్దామని ఇద్దరూ అనుకున్నారట. ఎలాంటి కథ కావాలని పవన్ కళ్యాణ్ రాజమౌళి అడగగా మీకు నచ్చిన కథలు తీసుకురండి అని చెప్పారు. ఆ తరవాత పవన్ కళ్యాణ్ మళ్లీ చెబుతాను అనడంతో రాజమౌళి ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

Rajamouli to clash with Pawan Kalyan?

ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. కనుక పవన్ కళ్యాణ్ తో చేసే సమయం ఉండదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అయితే రాజమౌళి చెబుతున్న దాని ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడప్పుడే రావడం చాలా కష్టం.

You may also like