Home Filmy Adda ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే: శ్రీనువైట్ల

ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే: శ్రీనువైట్ల

by Megha Varna

మహేష్ బాబు అందరికీ సుపరిచితమే. ప్రత్యేకించి మహేష్ బాబుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. పోకిరి, అతిథి, సైనికుడు, ఖలేజా, సరిలేరు నీకెవ్వరు ఇలా ఎన్నో సినిమాల్లో మహేష్ నటించారు. పోకిరి సినిమా మహేష్ బాబుకి మంచి హిట్ ని ఇచ్చింది.

Happy Birthday Mahesh Babu: Twitter floods with wishes on superstar's birthday | People News | Zee News

అలానే శ్రీను వైట్ల మహేష్ బాబుతో చేసిన దూకుడు సినిమా కూడా మంచి సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి హిట్ ను ఇచ్చింది. కానీ శ్రీను వైట్ల మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఆగడు మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఆలీతో సరదాగా షోకి శ్రీనువైట్ల వచ్చారు. ఆ షోలో అలీతో పాటుగా ఆయన సందడి చేసారు. తాజాగా ఆలీతో సరదాగా ప్రోమో విడుదల అయ్యింది. అయితే ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.

Srinu Vaitla to work free?

దూకుడు సినిమా మంచి హిట్ ని తీసుకొచ్చింది. ఆ సినిమాలో మహేష్ బాబు మందు కొట్టే సీన్ ని పెట్టించారని శ్రీనువైట్ల అన్నారు. ఇక ఆగడు సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబు ఫ్యాన్స్ మాస్ సినిమా కావాలని గోల చేశారని… ఆ పాయింట్ వల్ల ఆగడు సినిమా ఫ్లాప్ అయిందని శ్రీనువైట్ల అన్నారు.

You may also like