Ads
థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటీటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటీటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు. ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ నిన్న విడుదల అయ్యింది. ఇందులో బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి మంచు కుటుంబం వారు అతిథులుగా వచ్చారు. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఈ ప్రోగ్రాంకి అతిధులుగా వచ్చారు.
Video Advertisement
ప్రోగ్రాంలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మోహన్ బాబు గారు, బాలకృష్ణ మాట్లాడారు. ఇందులో రెండవ ఎపిసోడ్ కి రానా దగ్గుబాటి, మూడవ ఎపిసోడ్ కి నాని, నాలుగవ ఎపిసోడ్ కి ప్రభాస్, ఐదవ ఎపిసోడ్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథులుగా వస్తారు అని సమాచారం. ఇందులో కూడా బాలకృష్ణ వారి కెరియర్ కి సంబంధించి, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అడుగుతారు. బాలకృష్ణ ఇలా మొదటిసారి హోస్ట్ చేయడం అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. దాంతో చాలా మంది ప్రేక్షకులు, “అసలు షో ఎలా ఉండబోతోంది? ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి?” అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8#9
#10
End of Article