Ads
థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహా తీసుకొచ్చింది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు.
Video Advertisement
ఇందులో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా మంచు కుటుంబం వచ్చారు. అయితే ప్రోగ్రాంలో భాగంగా బేగం అనే ఒక పాపకి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని, చికిత్సకి డబ్బులు అవసరం అని చెప్పారు. ఇది అంతా చూసిన బాలకృష్ణ ఆ ఖర్చు మొత్తం తాను భరిస్తాను అని చెప్పారు. చెప్పినట్టుగానే బాలకృష్ణ ఆ పాప బాధ్యతను తీసుకున్నారు. దాంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు అందరూ బాలకృష్ణని ప్రశంసిస్తున్నారు.
End of Article