Ads
ఏదైనా సాధించాలి అనే ఆలోచనలు అందరికీ వస్తాయి. కానీ కష్టపడి సాధించడం మాత్రం కొందరే చేయగలరు. ఆ జాబితాకి చెందిన వారే జకిత్సోనో జమీర్. ఈనాడు కథనం ప్రకారం, జమీర్ నాగాలాండ్ కి చెందినవారు. చిన్నప్పటి నుంచి తనకి అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా చేయాలి అని ఆలోచన ఉండేది.
Video Advertisement
అందుకు వ్యాపారం సరైన మార్గం అని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తయ్యాక వ్యాపారం మీద దృష్టి పెట్టాలని అనుకున్నారు. లిటరేచర్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్థిక కారణాల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.
కాఫీ తయారీకి సంబంధించిన వర్క్‌షాప్‌కి హాజరైన జమీర్, కాఫీ షాప్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో మరిన్ని వివరాలను సేకరించి, 2018 లో ఫ్రేమర్స్ స్క్వేర్ పేరుతో ఒక కాఫీ షాప్ తెరిచారు. ప్రారంభించిన కొన్ని నెలలకే షాప్ తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. దాంతో జమీర్, హర్ అండ్ నౌ అనే ఒక వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని, తాను చేసిన తప్పుల్ని తెలుసుకొని, 2019లో షాప్ మళ్ళీ తెరిచారు. అప్పటి నుంచి జమీర్ వ్యాపారం అభివృద్ధి చెందింది.
షాప్ లో ఇకో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. స్థానికంగా తయారు చేసిన తిను పదార్థాలు కూడా షాప్ లో విక్రయిస్తారు. ఈ వ్యాపారం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు జమీర్. కాఫీ తయారీపై స్థానిక మహిళలకి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆసక్తి ఉన్న యువతులకు కాఫీ పంట సాగులో మెలుకువలు నేర్పిస్తూ ఉంటారు. అలా ఎంతో మందికి జమీర్ ఒక ఆదర్శంగా నిలిచారు.
End of Article