Home Bigg Boss 5 telugu “మనం” సినిమాలో ఉన్న ఈ బిగ్‌బాస్ తెలుగు-5 కంటెస్టెంట్ ని గుర్తుపట్టారా..? ఎవరంటే..?

“మనం” సినిమాలో ఉన్న ఈ బిగ్‌బాస్ తెలుగు-5 కంటెస్టెంట్ ని గుర్తుపట్టారా..? ఎవరంటే..?

by Mohana Priya

అక్కినేని నాగార్జున కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో మనం ఒకటి. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  ఈ సినిమాలో మూడు తరాలకు చెందిన అక్కినేని హీరోలు కలిసి నటించారు. అంతే కాకుండా అఖిల్ కూడా ఒక అతిధి పాత్రలో కనిపించారు.

మనం సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా విక్రమ్ కె.కుమార్ అందించిన స్టోరీ కూడా ఈ సినిమాకి ఒక ముఖ్య హైలైట్గా నిలిచింది.

Bigg Boss Telugu 5 contestant in manam movie

ఒక రకంగా చెప్పాలంటే సినిమా హిట్ అవడానికి ప్రధాన బలం కూడా స్టోరీనే అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఎంతో మంది నటులు అతిధి పాత్రలో కనిపించారు. వారిలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అలాగే బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, ఇంకా కొంత మంది నటులు కొంతసేపు కనిపిస్తారు. వీళ్ళందరూ మాత్రమే కాకుండా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఒక నటి కూడా ఈ సినిమాలో నటించారు.

Bigg Boss Telugu 5 contestant in manam movie

బిగ్ బాస్ తెలుగు-5 ద్వారా పేరు సంపాదించుకున్న శ్వేతా వర్మ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. ఇందులో శ్వేత, నాగార్జున ఎంట్రీ సీన్ లో నాగార్జునకి అవార్డ్ వచ్చినప్పుడు అనౌన్స్ చేసే వ్యక్తి గా నటించారు. అప్పుడు శ్వేత బహుశా మన ఎవరికీ తెలియదు. అలా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు శ్వేత. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

You may also like