Home Filmy Adda నెటిజెన్ కామెంట్ కి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రిప్లై ని చూస్తే నవ్వాపుకోలేరు..!

నెటిజెన్ కామెంట్ కి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రిప్లై ని చూస్తే నవ్వాపుకోలేరు..!

by Megha Varna

ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రపంచమంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

 

ఈ సినిమా పూర్తిగా ఫిక్షనల్ మూవీ. చరిత్రలో ఇద్దరు గొప్ప స్టార్స్ గురించి చెప్పేటప్పుడు ఎంతో శ్రద్ధగా తీయాలని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఈ చిత్రం కథ గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film 'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

ఇక వాటి కోసం చూస్తే… 1920లో స్వతంత్ర సమరయోధులు ఇంటి నుండి వెళ్ళిపోయి రెండేళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారని.. అయితే ఆ గ్యాప్ లో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి ఆ పార్ట్ ని తెరకెక్కించాలని రాజమౌళి అనుకోవడంలో తప్పేమీ లేదు.

RRR Movie Song – Thematic Yet Appealing With Goosebumps Ending

కానీ మనకు తెలిసిన స్టోరీని మార్చేసి చూపించడం ఏమిటి అని తన సందేహాన్ని వ్యక్తపరిచారు. దీనిపై ఆరా చిత్రయూనిట్ స్పందిస్తూ ”ఓరి మీ దుంపలు తెగ.. మీరు ఎక్కడ దొరికారురా.. రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా.. క్లియర్ గా మీకు తెలిసిన స్టోరీ సినిమాలో ఉండదని ఇటువంటివన్నీ మైండ్ లో నుంచి తీసేసి ఎంజాయ్ చేయండి” అంటూ ఫన్నీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది.

You may also like