Home Filmy Adda Krithi Shetty: రెడ్ సారీలో మెరిసిపోతున్న కృతి శెట్టి..!

Krithi Shetty: రెడ్ సారీలో మెరిసిపోతున్న కృతి శెట్టి..!

by Megha Varna

కృతి శెట్టి తెలుగు ప్రేక్షకుల మనసుని తన అందంతో దోచేసింది. చిన్న వయసులోనే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసి ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది.

 

ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని కృతి శెట్టి అందుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా వైష్ణవ్ తేజ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. బేబమ్మగా కృతి శెట్టి నటించి కుర్రకారు మనసుని దోచేసింది. ఈ చిత్రంలో కొన్ని డైలాగులు ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేసాయి.

 

ఈ అందాల భామ మహారాష్ట్రలో పుట్టింది. 18 ఏళ్ళ వయసులోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ లో నటిస్తోంది. అదే కాకుండా ఇంకొక అయిదారు సినిమాల్లో కూడా ఈమె నటించనుంది.

Vijay Sethupathi, Vaisshnav Tej, Krithi Shetty star in Buchi Babu Sana's Uppena; see trailer-Entertainment News , Firstpost

తాజాగా కృతి శెట్టి ఎరుపు రంగు చీరలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మెడలో అందమైన పచ్చలహారంతో ఈమె చాలా అందంగా కనపడుతోంది. అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంది అని నేటిజన్లు చూసి కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ అందాలభామ రెడ్ సారీలో ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

 

You may also like