Home Filmy Adda బ్రహ్మానందం కు ఏమైంది..? ఇలా అయిపోయారు ఏంటి..? వైరల్ అవుతున్న వీడియో..!

బ్రహ్మానందం కు ఏమైంది..? ఇలా అయిపోయారు ఏంటి..? వైరల్ అవుతున్న వీడియో..!

by Megha Varna

దశాబ్దాల నుండి బ్రహ్మానందం తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఎన్నో సినిమాలు చేసి ఎంతో మందిని మెప్పించిన బ్రహ్మానందం కొంత కాలంగా సినిమాల సంఖ్య తగ్గించారు.

వయసు రీత్యా ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలను మాత్రమే చేస్తున్నారు. తాజాగా నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మాచర్ల నియోజకవర్గం లో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా నుంచి బ్రహ్మానందంను తీసేసి ఆయనకు షాకిచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు.

64 साल का हुआ ये फेमस कॉमेडियन, एक फिल्म के लिए लेता है इतनी फीस, पास है करोड़ों की प्रॉपर्टी | Comedian Brahmanandam birthday today charge 1 crore for a film KPJ

ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. జిషాన్ ఉస్మాన్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడం జరిగింది. బ్రహ్మానందానికి టీం విషెస్ కూడా తెలిపింది. ఈ చిత్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా తీశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన నటనకి ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారని బ్రహ్మానందం అన్నారు. తన పాత్ర కూడా బాగుందని.. ప్రేక్షకులకు నచ్చుతుందని బ్రహ్మానందం చెప్పారు. తాజాగా ఈ చిత్రంలో బ్రహ్మానందం చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే మొన్నటి వరకు ఎంతో గ్లో తో ఉండే ఆయన ముఖం పాలిపోయినట్లు విచిత్రంగా కనపడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వీడియో లో బ్రహ్మానందంలో వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఆయన ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. వయసు మీద పడినా.. ఆయన ఫేస్ లో గ్లో అలానే ఉండేది. కానీ.. ఈ వీడియోలో ఆయన చాలా డల్ గా కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు కంగారు పడుతున్నారు.

Watch Video:

You may also like