Prabhas : “ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్.!” అంటూ… ప్రభాస్ పై బండ్ల గణేష్ కామెంట్స్.!

Prabhas : “ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్.!” అంటూ… ప్రభాస్ పై బండ్ల గణేష్ కామెంట్స్.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

Video Advertisement

prabhas

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచింది.

bandla ganesh comments on prabhas

 

అయితే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ని అభినందిస్తూ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. బండ్ల గణేష్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ని అభినందించారు. బండ్ల గణేష్ ఈ విధంగా ట్వీట్ చేశారు, “అమెరికా వెళ్ళినాడు లిబర్టీ స్టాట్యూ ఇండియా వచ్చినాడు ప్రభాస్ సినిమా చూడకుండా ఉండరు.”

bandla ganesh comments on prabhas

ఇంకొక ట్వీట్ లో బండ్ల గణేష్ ఈ విధంగా పేర్కొన్నారు, “ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్ అది బ్లడ్ లో ఉండాలి అది ఇక్కడ నిండుగా ఉంది.” అని రాశారు బండ్ల గణేష్. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ హీరోగా నటించిన డేగల బాబ్జీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రభాస్ కూడా ఇటీవలే ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం సలార్ షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.


End of Article

You may also like