Ads
వీ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నాని సినిమా టక్ జగదీష్. ఈ ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
Video Advertisement
టక్ జగదీష్ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. అయితే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గోపీసుందర్ అందించారు. అసలు తమన్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్.
అలాంటిది, “ఈ సినిమాకి గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఏంటి?” అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై తమన్ ఇటీవల స్పందించారు. తమన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, “నేను ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం పూర్తి చేశాను. కానీ అది నాని గారికి నచ్చలేదు. అప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్ నేపధ్య సంగీతం అందించారు. ఇలాంటి సంఘటన నా జీవితంలో మొదటిసారి జరిగింది. నేను నేను నా మనసు పెట్టి కంపోజ్ చేశాను. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం అవ్వట్లేదు” అని అన్నారు.
End of Article