Ads
ఒక యాచకుడికి అంతిమయాత్ర వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటక లోని బళ్ళారి లో జరిగిన ఓ యాచకుడు అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు వచ్చారు.
Video Advertisement
బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రముఖ వ్యక్తి మరణిస్తే ఎలా జనం వస్తారో అంత మంది జనం వచ్చారు. అయితే ఇంత మంది రావడానికి గల కారణం ఆ యాచకుడుతో పట్టణవాసులుకి ఉండే అనుబంధమే.
అతనికి బిక్షం వేస్తే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అందుకే చాలా మంది అతన్ని పిలిచి మరీ అన్నం పెట్టేవారట. శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం లో బాస్య మృతి చెందాడు. ఓ ప్రముఖ నాయకుడు మరణిస్తే.. ఎంత మంది హాజరు అవుతారు బాస్య మరణించినప్పుడు అతని అంత్యక్రియలకు కూడా అంత కంటే ఎక్కువ మందే హాజరు అయ్యారు. ఈ వార్త దేశమంతా చర్చనీయాంశమైంది.
గత ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. బ్యానర్లు కట్టి ఊరేగింపుగా పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. బిక్షం ఎత్తుకునేటప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా బాస్య ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగతా డబ్బుని తిరిగి ఇచ్చేసేవాడట. అందుకే బాస్య అంటే అక్కడివారికి మమకారం కూడా ఎక్కువే. అతనికి భిక్షం వేయడానికి వచ్చే ప్రజలందరినీ అతను అప్పాజీ అంటూ పిలిచేవారట. మాజీ మంత్రి పరమేశ్వర నాయక్, మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత ఎం.పి. ప్రకాశ్ వంటి వారితో కూడా బాస్య ఏ బెరుకు లేకుండా మాట్లాడేసేవాడట. అతను చనిపోయాడని తెలియడంతో.. అక్కడి ప్రజలంతా సోషల్ మీడియా మాధ్యమాలలో అతని గురించి చర్చించుకుంటున్నారు.
End of Article