Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు.
Video Advertisement
ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో కూడా సమంత చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే, ఇటీవల కేటీఆర్ చేసిన ఒక ట్వీట్‌పై సమంత ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
770 మంది మరణించిన రైతులకు 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడంపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇదే విషయంపై కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సమంత నమస్కారం సింబల్ ని రిప్లైగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సమంత కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే తమిళ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, నయనతార మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
End of Article