Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5 : “మాపై అంత పగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి.? అంటూ బిగ్‌బాస్ “రవి” భార్య కామెంట్స్.!

Bigg Boss Telugu-5 : “మాపై అంత పగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి.? అంటూ బిగ్‌బాస్ “రవి” భార్య కామెంట్స్.!

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 78 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న బలమైన కంటెస్టెంట్స్‌లో ఒకరు రవి. ప్రతి వారం తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు రవి. అయితే, రవి మీద నెగటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ కేవలం రవిని ఉద్దేశించి మాత్రమే కాకుండా, తన కుటుంబంపై కూడా వస్తున్నాయి. దాంతో, రవి భార్య నిత్య ఈ విషయంపై స్పందించారు.

ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం, నిత్య ఈ విషయంపై మాట్లాడుతూ, “కొంత మంది కావాలనే నాపై, నా కూతురిపై ట్రోల్స్ చేస్తున్నారు. మేము వాళ్ళని ఏం చేశాం? వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాం? మాపై అంత పగ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ముమ్మాటికీ గేమ్ స్పిరిట్ కాదు. దయచేసి ఇవన్నీ ఆపండి” అని చెప్పారు.

You may also like