Ads
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వరదలు చోటు చేసుకోవడం వల్ల ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
Video Advertisement
ఈ విధంగానే రాయలచెరువు వద్ద కూడా భారీ వర్షాలు పడటంతో పరిసర ప్రాంతాలకు ప్రమాదం ఉంటుందని ముందుగానే అధికారులు చర్యలు తీసుకున్నారు.
సుమారుగా పది రోజుల వరుసగా భారీ వర్షాల కారణంగా రాయలచెరువుకు చిన్న గండి పడింది దాంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు అధికారులు కలిసి ఆ నీరుని ఆపేందుకు ఇసుక బస్తాలను ఉపయోగించి అడ్డుకట్ట వేశారు. అయినా సరే ప్రమాదం తగ్గలేదు, చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు నీటిమట్టం అయిపోయాయి. లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇల్లులు నీటితో మునిగిపోయాయి.
దాంతో అక్కడ అధికారులు ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వారికి వసతితో పాటుగా ఆహారాన్ని కూడా అందించారు. ఇంత తీవ్రమైన పరిస్థితి 1991 లో వచ్చిందట, ఆ తర్వాత ఇదే రావడం. నీరు ఎక్కువగా ఉండడంతో రోడ్లు కూడా బ్లాక్ చేయడం జరిగింది. డాబా ఇల్లులు ఉన్నవారైనా కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వెళితేగాని సురక్షితమని భావించట్లేదు. అలాంటిది చిన్న ఇల్లు ఉన్న వారి పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి.
రాబోయే రెండు మూడు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇళ్లలో ఉండే సామాన్లను, ప్రజలను వేరే ప్రదేశాలకి చేర్చడానికి తెప్పను ఉపయోగిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి గురించి అందరికీ తెలియాలని ప్రముఖ సీరియల్ నటి మాధురి రెడ్డి గారు ఒక వీడియో ద్వారా అందరితో పంచుకున్నారు. అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Featured image source: Madhureddy official Youtube channel
End of Article