Ads
అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి ఫ్యాన్స్ షేర్ చేసి కామెంట్స్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో త్రోబ్యాక్ సందడి విపరీతంగా ఎక్కువైపోయింది.
Video Advertisement
నటులు తమ యొక్క చిన్ననాటి ఫోటోలని ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఆ ఫోటో లో ఉన్న హీరోయిన్ ని మీరు గుర్తుపట్టారా..? ఎవరో కనుక్కోలేకపోయారా..? ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు ఒక టాలీవుడ్ హీరోయిన్.
మొదటి సినిమాతోనే మదిని దోచుకున్న అందాల భామ ప్రియాంక జవాల్కర్. తన అభినయంతో ఫ్యాన్స్ ని ఎప్పుడు ఫిదా చేసేస్తారు. ఈమె ఐదు సినిమాలు చెయ్యగా బాక్సాఫీస్ దగ్గర రెండు హిట్లు లభించాయి. ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన తిమ్మరసు ఓకే ఓకే అనిపించినా.. ఎస్ ఆర్ కళ్యాణ మండపం మంచి హిట్ అందుకుంది.
End of Article