Sonu Sood : మరొక సారి తన ఉదారతను చాటుకున్న సోనూ సూద్.! శివ శంకర్ మాస్టర్ గురించి తెలియడంతో..?

Sonu Sood : మరొక సారి తన ఉదారతను చాటుకున్న సోనూ సూద్.! శివ శంకర్ మాస్టర్ గురించి తెలియడంతో..?

by Mohana Priya

Ads

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌కి కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్‌లో చేరారు. హైదరాబాద్ లో ఉన్న ఏఐజి హాస్పిటల్ లో శివ శంకర్ మాస్టర్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. డాక్టర్లు 75% లంగ్స్ కి ఇన్ఫెక్షన్ సోకింది అని చెప్పారు.

Video Advertisement

శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకుకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయన పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది అని సమాచారం. శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్న ఎన్నో పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ స్పందించి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

sonu sood steps forward to help shiva shankar master

సోషల్ మీడియా వేదికగా సోను సూద్ ఈ విధంగా రాశారు. “నేను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆయనని కాపాడటానికి నా వంతు సహాయం నేను చేస్తాను” అని అన్నారు. శివ శంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ కృష్ణ ప్రస్తుతం వారి కుటుంబాన్ని చూసుకుంటున్నారు.

 


End of Article

You may also like