Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5: బిగ్‌బాస్ హౌస్ లోకి దీప్తి..? “షన్ను”కి ఏం వార్నింగ్ ఇచ్చారంటే..?

Bigg Boss Telugu-5: బిగ్‌బాస్ హౌస్ లోకి దీప్తి..? “షన్ను”కి ఏం వార్నింగ్ ఇచ్చారంటే..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 81 రోజులు గడిచింది.ఇక ఈ వారం బిగ్ బాస్ విషయానికి వస్తే, కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులని కలుసుకొని మాట్లాడుతున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో కాజల్ కూతురు, భర్త వచ్చారు.

నిన్నటి ఎపిసోడ్ లో శ్రీ రామచంద్ర ఇంటి సభ్యులు, మానస్ తల్లి, షణ్ముఖ్ ఇంటి సభ్యులు, అలాగే సిరి వాళ్ళ తల్లి కూడా షోకి వచ్చారు. అంతే కాకుండా, సిరి తల్లి, సిరితో, షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ, “మీరిద్దరూ అలా హగ్ చేసుకోవడం బాలేదు” అని అన్నారు. అయితే, షణ్ముఖ్ కుటుంబం నుండి షణ్ముఖ్ తల్లి వచ్చి షణ్ముఖ్ తో మాట్లాడుతారు. ప్రతీ ఒక్క ఇంటి సభ్యులకి వారి కుటుంబం నుండి ఎవరైనా ఇద్దరు వెళ్లి మాట్లాడే అవకాశం ఉంది. దాంతో షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా కూడా హౌస్ లోకి వెళ్ళచ్చు అనే వార్తలు వస్తున్నాయి.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

కానీ శనివారం ఎపిసోడ్ లో దీప్తి సునైనా షోకి వస్తారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫిల్మీబీట్ కథనం ప్రకారం, దీప్తి షణ్ముఖ్ తో మాట్లాడి, సిరితో ఉండడం వల్ల తన పాపులారిటీ తగ్గిపోతోంది అని హింట్ ఇచ్చి వెళ్లారట. అంతే కూండా, ఇండైరెక్ట్ గా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి, హాగ్ చేసుకొని దీప్తి వెళ్ళిపోతారట. ముందు అయితే, షణ్ముఖ్ తల్లి ఉమా రాణి హౌస్ లోకి వెళ్లి మాట్లాడుతారు. తర్వాత సర్ప్రైజ్ గా ఉండాలని బిగ్ బాస్ యాజమాన్యం దీప్తి ఎంట్రీ శనివారం ప్రసారం అయ్యేలాగా ప్లాన్ చేసారు అని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు ఆగాల్సిందే.

You may also like