Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది. అయితే ఈ పాటలో కొన్ని విజువల్స్ మనకు చూపించారు. అవి దేనికి సంబంధించినవో ఇప్పుడు చూద్దాం.
#1 పాట మొదట్లో రామ్ చరణ్ బ్రిటిష్ పోలీస్ యూనిఫాంలో కనిపిస్తారు. ఇదే షాట్ మనకి టీజర్లో కూడా చూపించారు.
తర్వాత పాట మధ్యలో కూడా రామ్ చరణ్ అదే యూనిఫాంలో దెబ్బలతో కనిపిస్తారు. మొత్తం ఒకటే సీన్ కి సంబంధించింది అని అర్థమైపోతుంది.
#2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ షాట్స్ కూడా కొన్ని చూపించారు. అందులో ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఒకటే కాస్ట్యూమ్ లో కనిపించడం మనం గమనించవచ్చు. ఒక షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా ఉంటారు.
తర్వాత జైల్లో పెట్టిన షాట్.
ఆ తర్వాత ఒక ఫైటింగ్ మధ్యలో దెబ్బలు తగిలిన షాట్ ఉన్నాయి. మనం సరిగ్గా గమనిస్తే టీజర్ లో చివరిలో జూనియర్ ఎన్టీఆర్ అదే కాస్ట్యూమ్ లో ఫైట్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఈ పాటలో చూపించిన జూనియర్ ఎన్టీఆర్ షాట్స్ అన్ని క్లైమాక్స్ కి ముందు, క్లైమాక్స్ మధ్యలో వచ్చే సీన్స్ అని అర్థమైపోతుంది.
#3 అలాగే ఈ పాటలో ఆలియాభట్, మట్టి చేతుల్లోకి తీసుకోవడం మనం చూడొచ్చు.
ఇదే షాట్ కి కొనసాగింపుగా ఆలియా భట్ మట్టిని రామ్ చరణ్ కి బొట్టుగా పెట్టడం మనకు చూపించారు.
తర్వాత ఆలియా భట్ కి సంబంధించిన ఇంకొక షాట్ కూడా ఉంది.
#4 ఇవి మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, శ్రీయ ఉన్న ఒక్క సీన్ కూడా మనకు చూపించారు. ఇందులో అజయ్ దేవగన్ కి సింగర్ హేమచంద్ర గొంతు మనం వినవచ్చు.
ఈ ఫైట్ కి సంబంధించిన ఇంకొక షాట్ కూడా చివర్లో మనకు చూపించారు.
#5 ఒక అమ్మాయి పోలీస్ జీప్ లో వెళ్తూ షాకింగ్ గా చూస్తూ ఉండడం కూడా మనం ఇందులో గమనించవచ్చు. కానీ ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం ఇంకా రివిల్ చేయలేదు. అమ్మాయి పాత్రకి ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
#6 ఇందులో రామ్ చరణ్ ఖాకీ పోలీస్ యూనిఫాంలో అది కూడా గాయాలతో ఉన్నారు.
#7 ఇందులో ఒక బాబుని షూట్ చేయడం మనం చూడొచ్చు. అయితే, ఈ బాబు జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. బహుశా, ఇలా షూట్ చేసినప్పుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నప్పుడు ఎవరైనా తీసుకు వెళ్లి పెంచుకోవడం, అందుకే కొమరం భీమ్ అడవులలో పెరగడం వంటివి మనకి ఏమైనా చూపిస్తారేమో.
#8 ఈ పాట మొత్తంలో అందరికీ ప్రశ్నార్థకంగా మారింది మాత్రం ఈ చెయ్యి. మనం సరిగ్గా గమనిస్తే, చేతిలో కొన్ని నాణాలు ఉన్నాయి. వాటి మీద ఇండియా 1905 అని రాసి ఉంది. చేయి చూస్తే ఆడవారి చెయ్యి లాగా అనిపిస్తోంది. మనకి చూపించిన దాని ప్రకారం శ్రీయ, ఆలియా భట్ మట్టిగాజులు వేసుకున్నారు. ఒలీవియా మోరిస్ కి సంబంధించిన ఒక్క షాట్ కూడా ఇందులో లేదు. మరీ చేయి తనదేనా? మరి ఆ చేయి ఎవరిది అనేది మాత్రం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయ్యింది.
#9 ఈ పాటలో కొన్ని షాట్స్ మినహాయిస్తే మనకి ఎక్కువగా చూపించిన షాట్స్ అని క్లైమాక్స్ కి సంబంధించినవే. అలాగే సినిమాలో ముఖ్య పాత్రలో నటించే నటీనటులందరూ ఈ పాటలో కనిపించారు.
ఈ పాట సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది. ప్రస్తుతం అయితే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
End of Article