Home Filmy Adda Mahesh Babu : పవన్ కళ్యాణ్ కాకుండా “అతడు”ని రిజెక్ట్ చేసిన మరొక యంగ్ హీరో ఎవరో తెలుసా..?

Mahesh Babu : పవన్ కళ్యాణ్ కాకుండా “అతడు”ని రిజెక్ట్ చేసిన మరొక యంగ్ హీరో ఎవరో తెలుసా..?

by Mohana Priya

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా మర్చిపోవడం చాలా కష్టం. టీవీ లో ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసినా సరే మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది. అంత మ్యాజిక్ ఉంది ఆ సినిమాలో.

ముఖ్యంగా ఆ డైలాగ్స్ అయితే ఇప్పటికి కూడా మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మణి శర్మ గారు అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, త్రివిక్రమ్ అతడు సినిమా కథని మహేష్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కి వినిపించారు అని అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ కి కథ నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

uday kiran 1

పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరొక హీరో కూడా ఈ కథని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అనే ఒక ఇంస్టాగ్రామ్ పేజ్ కథనం ప్రకారం, ఆ హీరో మరెవరో కాదు అప్పట్లో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించిన ఉదయ్ కిరణ్. త్రివిక్రమ్ ఈ సినిమా కథని ఉదయ్ కిరణ్ కి కూడా వినిపించారట. ఈ సినిమాకి నిర్మాత అయిన మురళీ మోహన్ గారు ఉదయ్ కిరణ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేయలేకపోయారట. ఈ వార్త ఒకటి అయితే వైరల్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ కథని వినిపించడంతో, మహేష్ బాబుకి కథ నచ్చి సినిమా చేస్తాను అని ఒప్పుకున్నారు.

You may also like