Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5 : “వద్దు మళ్లీ మీ మమ్మీ వస్తారు..!” అంటూ… సిరికి దండం పెట్టిన షన్ను..!

Bigg Boss Telugu-5 : “వద్దు మళ్లీ మీ మమ్మీ వస్తారు..!” అంటూ… సిరికి దండం పెట్టిన షన్ను..!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.

ఈ ఎపిసోడ్ లో అంతకుముందు సిరి, షణ్ముఖ్, కాజల్, మానస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో షణ్ముఖ్ ని సిరి, “బయటికి వచ్చాక చూస్తాను. నీ పెర్ఫార్మన్స్ లో ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తా” అని అన్నారు. అందుకు షణ్ముఖ్, “అంత ఛాన్స్ ఇవ్వదు మా పాప” అంటే, అందుకు సిరి “నేను తీసుకోను కూడా” అని అన్నారు. అప్పుడు షణ్ముఖ్, “అసలు మొఖం కూడా చూడలేదు నీ వైపు” అని అన్నారు. అందుకు సిరి అక్కడి నుండి అలిగి వెళ్లిపోవడం మనం నిన్నటి ఎపిసోడ్ లో చూడొచ్చు.

shannu reaction for siri hug in bigg boss telugu 5

తర్వాత షన్ను, సిరి మాట్లాడుకుంటారు. సిరికి షన్ను సారీ చెప్పారు. అప్పుడు సిరి షన్నుని నిల్చోమని చెప్పారు. అందుకు షన్ను “బాబోయ్ వొద్దు మీ మదర్ వస్తారు వొద్దు” అని చెప్పారు. అందుకు సిరి, “ఏం కాదు అమ్మకి కూడా తెలుసు” అని అన్నారు. అప్పుడు షన్ను సిరిని హాగ్ చేసుకొని, “ఆంటీ ఇది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే” అని అన్నారు.

You may also like