Ads
సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చారు అంటే బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి ఉండొచ్చు అని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ చాలా మంది సినిమా హీరోలు, దర్శకులు ఉన్నత చదువులు అభ్యసించి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం జరిగింది.
Video Advertisement
ఇండస్టీకి వచ్చిన హీరోలు, డైరక్టర్స్ ఎంతో మంది మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసి ఆ ఇంజనీర్ పట్టాని పట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటి మెకానిక్ ఇంజనీర్ ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
#1. అక్కినేని నాగార్జున:
అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏఎన్ఆర్ వారసత్వంగా వచ్చిన నాగార్జున మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి తర్వాత ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది.
#2. గౌతమ్ మీనన్:
డాక్టర్ గౌతమ్ మీనన్ కూడా మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసి తర్వాత ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది.
#3. శేఖర్ కమ్ముల:
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్లపాటు అమెరికాలో పని చేసి తర్వాత ఇండియాకి రావడం ఆ తరవాత సినిమాల్లోకి రావడం జరిగింది. ఆనంద్ సినిమాతో సక్సెస్ కొట్టి ఆ తర్వాత నుండి కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు శేఖర్ కమ్ముల.
#4. కార్తీ:
బీటెక్ పట్టా చేతికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం వద్ద పని చేశాడు 30 ఏళ్లు దాటిన తర్వాత హీరో అయ్యాడు.
#5. అవసరాల శ్రీనివాస్:
అవసరాల శ్రీనివాస్ అష్టాచమ్మా సినిమాతో నటుడిగా మారాడు. శ్రీనివాస్ అవసరాల అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన దర్శకుడు కూడా.
#6. నవీన్ చంద్ర:
బీటెక్ పూర్తి చేసిన తర్వాత నవీన్ చంద్ర జాబ్ కోసం తిరిగి తిరిగి ఆఖరికి ఒక హోటల్ లో పని చేసాడట. తర్వాత అందాల రాక్షసి తో హీరోగా మారాడు.
#7. తరుణ్ భాస్కర్:
పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మెకానికల్ బ్యాగ్రౌండ్ చేసాడు. తరుణ్ భాస్కర్ గొప్ప దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా.
End of Article