Home Filmy Adda RRR ట్రైలర్‌లో “రామ్ చరణ్” వేసే బాణం గమనించారా.? దానికి చివరిలో.?

RRR ట్రైలర్‌లో “రామ్ చరణ్” వేసే బాణం గమనించారా.? దానికి చివరిలో.?

by Mohana Priya

భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.

ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు. అలాగే శ్రియ శరన్, అజయ్ దేవగన్, సముద్రఖని వంటి నటుల్ని కూడా మనం ఈ ట్రైలర్ లో చూడచ్చు.

rrr trailer analysis and hidden details

ట్రైలర్ లో చాలా విషయాలు చెప్పినా కూడా, వాటి వల్ల సినిమాలో ఉన్న విషయాలపై ప్రశ్నలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. ఇదంతా చూస్తూ ఉంటే బహుశా ఇప్పటి వరకు మన ఎవరికీ తెలియని ఒక కథ గురించి రాజమౌళి చెప్పబోతున్నారు అని అర్థం అయిపోతోంది. మాములుగా రాజమౌళి సినిమా అంటే హీరోలని ఏ రేంజ్ లో చూపిస్తారో మనందరికీ తెలుసు. ఇంకా హీరోలు వాడే ఆయుధాలు కూడా చాల డిఫెరెంట్ గా ఉంటాయి.

did you observe this is alluri seetharama raju arrow in rrr trailer

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లో అల్లూరి సీతారామ రాజు చేతిలో ఉన్న ఆయుధం కూడా అలాగే డిఫెరెంట్ గా ఉంది. ఆ విల్లుకి ముందు గ్రెనేడ్ ఉంది. దాంతో ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు రాజమౌళిని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి సినిమాల్లో చిన్న చిన్న విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అని, వస్తువులకు కూడా ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారని ప్రశంసిస్తున్నారు.

You may also like