Ads
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.
Video Advertisement
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు. అలాగే శ్రియ శరన్, అజయ్ దేవగన్, సముద్రఖని వంటి నటుల్ని కూడా మనం ఈ ట్రైలర్ లో చూడచ్చు.
ట్రైలర్ లో చాలా విషయాలు చెప్పినా కూడా, వాటి వల్ల సినిమాలో ఉన్న విషయాలపై ప్రశ్నలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. ఇదంతా చూస్తూ ఉంటే బహుశా ఇప్పటి వరకు మన ఎవరికీ తెలియని ఒక కథ గురించి రాజమౌళి చెప్పబోతున్నారు అని అర్థం అయిపోతోంది. మాములుగా రాజమౌళి సినిమా అంటే హీరోలని ఏ రేంజ్ లో చూపిస్తారో మనందరికీ తెలుసు. అయితే, ఇందులో ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే, ఇందులో ఒక సీన్ లో రామ్ చరణ్ యోధుడుగా మారిన తర్వాత ఒక ఫైట్ చేస్తూ ఉండడం మనం చూడొచ్చు. అందులో చెట్టుకి రామ్ చరణ్ బాణం వేస్తారు. ఆ చెట్టు వెనకాల ఒక బ్రిటిష్ సైనికు డు నిలబడి ఉంటాడు. తర్వాత రామ్ చరణ్ ఆ బాణాన్ని వెనక్కి తంతారు. దాంతో చెట్టు వెనకాల ఉన్న సైనికుడికి ఆ బాణం తగులుతుంది. ఫైట్ ఇలా కూడా డిజైన్ చేయడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో రాజమౌళిని ప్రశంసిస్తున్నారు.
End of Article