Ads
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.
Video Advertisement
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు. అలాగే శ్రియ శరన్, అజయ్ దేవగన్, సముద్రఖని వంటి నటుల్ని కూడా మనం ఈ ట్రైలర్ లో చూడచ్చు. అయితే, ఇందులో ఒక సీన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదేంటంటే. ఇందులో ఎన్టీఆర్ ఒక సీన్‌లో బైక్ ఎత్తుతారు.
మామూలుగా బైక్ చాలా బరువు ఉంటుంది. ఆలా ఎత్తడం కష్టం. కానీ ఆ సీన్‌లో మాత్రం ఎన్టీఆర్ సులభంగా ఎత్తినట్టు చూపిస్తారు. “ఇలాంటి సన్నివేశాలు బాలీవుడ్‌లో ఉంటాయి. కానీ మన దగ్గర కూడా ఇలాంటి సీన్ రావడం ఏంటి?” అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అసలు విషయం బయటకి వచ్చింది. ఆ మోడల్ బైక్ బరువు 56 కిలోలు ఉంటుందట. దాంతో దాన్ని సులభంగా ఎత్తగలుగుతారు. అంతే కాకుండా, అంతక ముందు కూడా చాలా మంది ఇలా ఇదే మోడల్ బైక్ ని ఎత్తినట్టు చరిత్రలో ఉంది. దాంతో ఇప్పుడు ఈ విషయంపై ట్రోలింగ్ తగ్గింది.
End of Article