Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ అంచనాలు పెంచేసాయి.
పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప నుంచి వచ్చిన అప్ డేట్ తో సామ్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఓ అంటావా ఓ ఓ అంటావా అనే ఈ పాట ఇవాళ విడుదల అవుతుంది. ఈ పాట లిరిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఈ విధంగా సాగుతుంది. “ఓ అంటావా.. ఓ ఓ అంటావా… ఊపిరి ఆడనీక ఊపేస్తూంటావా. కమ్ అంటావా.. కుమ్మేస్తుంటావా… కామ్ గా కలుగులో దూరి కుమ్మేస్తుంటావా. సై అంటావా.. సై సై అంటావా.. సాయంకాలం పూట సైగే సేత్తావా. హాయ్ అంటావా..బాయ్ బాయ్ అంటావా… మూరెడు మల్లెలు తెచ్చి హాయిగా ఉంటావా. ఛీ అంటావా.. ఛీ పో అంటావా.. చీమలు దూరని చిట్టడవి చుట్టేస్తుంటావా” అని ఈ పాట లిరిక్స్ ఉంటాయట.
End of Article