Ads
న్యూజిలాండ్ ప్రభుత్వం సిగరెట్ స్మోకింగ్ విక్రయాలపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించబోతోంది. ఇప్పటికే పొగాకుపై కఠిన ఆంక్షలు విధిస్తున్న దేశాల్లో ఒకటిగా న్యూజిలాండ్ నిలిచింది.
Video Advertisement
భవిష్యత్తులో కూడా వీటిని అడ్డుకునేందుకు ఇతర ప్రయత్నాలు చేస్తోంది. నికోటిన్ లెవెల్ తక్కువగా ఉన్న పొగాకు ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలి అని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటాము అని గురువారం న్యూజిలాండ్ ప్రభుత్వం రిటైల్ వ్యాపారులకి హెచ్చరిక జారీ చేసింది.
న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయేషా వెర్రాల్ మాట్లాడుతూ, “యువత ఏనాడు సిగిరెట్లు తాగకుండా చూడాలన్నది మా కోరిక. యువతకి సిగరెట్ సరఫరా చేసినా, విక్రయించినా కూడా అది మేము నేరంగానే పరిగణిస్తాము” అని తెలిపారు. వచ్చే జూన్ లో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే సంవత్సరం చివరికల్లా పొగాకు ఉత్పత్తుల విక్రయ నిషేధ చట్టం అమల్లోకి తీసుకురాబోతున్నారు. 2024 నుండి దశలవారీగా అంశాలను అమల్లోకి తెస్తారు. ఆథరైజ్డ్ విక్రేతలని భారీగా తగ్గించబోతున్నారు. 2025 లో నికోటిన్ స్థాయి తగ్గించాలనే నిబంధనలు అమలు చేస్తారు.
2027 కి న్యూజిలాండ్ స్మోక్ ఫ్రీ జనరేషన్ గా మార్చాలి అన్నదే వారి ఉద్దేశం. న్యూజిలాండ్ లో ప్రస్తుతం సంవత్సరానికి 5000 మంది స్మోకింగ్ అలవాటు కారణంగా మరణిస్తున్నారు. అక్కడ 18 సంవత్సరాలలోపు వయసున్న వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి స్మోకింగ్ అలవాటు ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకున్నా కూడా, రిటైలర్లు మాత్రం వారి వ్యాపారాలకి ఈ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
End of Article