Ads
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రక్షణ దళాల ప్రధాన అధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.
Video Advertisement
ఈ వార్తతో యావత్ దేశం షాక్ లో మునిగిపోయింది. బిపిన్ తన చివరి కోరిక తీరకుండానే మరణించారు. బిపిన్ తన స్వస్థలమైన ఉత్తరాఖండ్ లోని సైనాలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. బిపిన్ మేనమామ భరత్ మాట్లాడుతూ, “2018లో బిపిన్ చివరిసారిగా తన సొంతూరుని సందర్శించారు” అని చెప్పారు. “2018 లో బిపిన్ వచ్చినప్పుడు కుల దేవత పూజ చేశారు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటారు అని చెప్పారు.”
“తన స్వస్థలంతో బిపిన్ కి చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. “ఉపాధి కోసం ఈ గ్రామం ప్రజలు వేరే ఊరికి వలస వెళ్లడం తనని బాధిస్తోంది అని చెప్పేవారు. రిటైర్ అయిన తరువాత ఈ వూరి ప్రజల కోసం ఏదైనా చేస్తాను” అని చెప్పారు. “బిపిన్ నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు వచ్చేే సంవత్సరం ఊరికి వస్తాను” అని చెప్పారు. తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని అన్నారు భరత్.
బిపిన్ భార్య మధులిక సొంత ఊరు మధ్యప్రదేశ్ లో షాడోల్ జిల్లాలోని సొహాగ్పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు అందరూ షాడోల్ లో ఉన్న వారి పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నారు. వచ్చే సంవత్సరం సొహాగ్పూర్ వచ్చి అక్కడ సైనిక పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు అని బిపిన్ రావత్ బావమరిది యశవర్ధన్ చెప్పారు.
End of Article