‘పుష్ప’ అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా రావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో యాంకర్ అనసూయ దాక్షాయిని పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా అందులో అనసూయ పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నిజంగా ఇది కల లాగా ఉంది అని అనసూయ చెప్పుకొచ్చింది. రెండు సంవత్సరాల తరవాత ఇంత మంది జనాన్ని చూడటం ఇదే మొదటిసారి అంటూ అనసూయ చెప్పింది.

ముందుగా తనను క్షమించాలని ఇంత పెద్ద స్టేజ్ ముందు మాట్లాడి చాలా రోజులు అయింది అని ఆమె అంది. అలానే భారీగా డబల్ మీనింగ్ డైలాగులు కూడా వేసింది అనసూయ. సాధారణంగా అమ్మ నాన్నలని దేవుళ్లను కోరికలను కోరుతూ ఉంటాము. కానీ నేను ఇలాగే ఒకేరోజు స్టేజ్ మీదకు వచ్చి మీతో నటించాలి అని అడిగాను.

వెంటనే వన్ వీక్ లో ఫోన్ వచ్చేసింది. ఇదే కంటిన్యూ అవుతుంది అంటే నేను చాలా అడగాలి అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ వేసింది అనసూయ. వెంటనే కవర్ చేస్తూ సినిమాలో ఛాన్స్లు అంటూ ఆమె నవ్వింది. ఇది విని అల్లు అర్జున్ కూడా నవ్వుకున్నాడు.
watch video :
