Home Filmy Adda తిరుమల ఆలయానికి సమంత వెంట వెళ్లిన ఆమె ఎవరో తెలుసా..?

తిరుమల ఆలయానికి సమంత వెంట వెళ్లిన ఆమె ఎవరో తెలుసా..?

by Megha Varna

సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాగ చైతన్యతో ఆమె విడిపోయిన తర్వాత తిరుపతి స్వామి వారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. సమంత తరచూ స్వామి వారిని దర్శించుకోవడం కోసం తిరుమల వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.

సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటే ఆమెకి తిరుపతి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం అలవాటు. ప్రస్తుతం సమంత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదల అవుతుంది.

samantha friend sadhna

 

సామాన్య భక్తులతో కలిసి సమంత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయ అధికారులు ఆమెకి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. ఆమెతో పాటు సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.  సాధన ఎన్నో షోలు కి, ఫోటోషూట్స్ కి, అలాగే సినిమాలకి సమంతకి మేకప్ చేయడంతో పాటు, ఇంకా చాలా మంది సెలబ్రిటీలకి మేకప్ ఆర్టిస్ట్ గా వ్యవహారించారు.

You may also like