పుష్ప “సామీ సామీ” సాంగ్ ప్రోమోలో ఈ సీన్ గమనించారా.?

పుష్ప “సామీ సామీ” సాంగ్ ప్రోమోలో ఈ సీన్ గమనించారా.?

by Mohana Priya

Ads

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

did you observe this scene in pushpa saami saami song

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే. మొదటి భాగమైన పుష్ప – ది రైజ్ డిసెంబర్ 17వ తేదిన విడుదల అవ్వబోతోంది. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సానా ఈ ఈవెంట్‌కి అతిధులుగా హాజరైయ్యారు. వీరందరితో పాటు సినిమాలో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ, అలాగే ఇంకా కొంత మంది నటులు, వారితో పాటు అల్లు అయాన్, అల్లు అర్హ కూడా ఈవెంట్‌కి హాజరయ్యారు.

did you observe this scene in pushpa saami saami song

ఈ సినిమాలోని పాటల ప్రోమోలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసారు. వీటితో పాటు సామీ సామీ పాట ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఇందులో రష్మిక అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేస్తూ నడుస్తూ ఉంటారు. సడెన్ గా ఇది చూస్తే గీతగోవిందం సినిమాలో ఏంటి ఏంటి పాటలో రష్మిక విజయ్ దేవరకొండ వెనకాల నడవడం గుర్తు వస్తుంది. దాంతో రెండు కొంచెం ఒకేలాగా ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ ఇదేమైనా సినిమా విడుదలకి ముందే పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. దాంతో తెరపై ఈ పాటలు ఎలా ఉంటాయో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like