Ads
ఈమె బస్సు ఎక్కడుందో ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఏదో మద్యం తాగి ఉందేమోనన్న అనుమానం కూడా అందరికీ కలిగింది. సాఫీగా సాగే ప్రయాణం అప్పటినుండి కూడా రచ్చ రచ్చ అయిపోయింది. అసలు ఏమైంది అనేది చూస్తే… న్యూస్ 18 కథనం ప్రకారం కోయంబత్తూరు డిపోకు చెందిన బస్సు 50 మంది ప్రయాణికులతో ఈరోడ్ నుంచి మధురైకి వెళుతోంది. బస్సు కరూర్ కి చేరుకుంది. అక్కడ శాంతి అనే ఒక మహిళ బస్సు ఎక్కింది.
Video Advertisement
ఆమెకు సీటు లేకపోవడంతో ఆమె ముందు వైపు నిల్చుంది. ఆ స్టాప్ లో ఆమె ఒక్కరే ఎక్కారు. బస్సు ఎక్కిన కొంతసేపటికి ఏదో వాసన రావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్లి మద్యం తాగిందేమో అని చూస్తూ ఉన్నాడు. శాంతి బస్సులో ఉన్న వాళ్లందర్నీ బండ బూతులు తిట్టడం మొదలు పెట్టింది. ఆమె మద్యం తాగి ఉందని అందరికీ అర్థమయ్యి ఓపికగా కూర్చుంది.
ఆమె మాత్రం అస్సలు ఆపకుండా తిడుతూనే ఉంది. ప్రయాణికుల అందరికీ కూడా ఆమె ప్రవర్తనతో విసుగు కలిగింది. డ్రైవర్, కండక్టర్ చెప్పినా సరే ఆమె వినిపించుకోలేదు. అలానే ఆమె రెచ్చిపోవడంతో పోలీస్ స్టేషన్ కి నేరుగా తీసికెళ్లారు. బస్సు దిగాలని చెప్తే కూడా ఆమె తిడుతూనే ఉంది.
ఎలాగోలా బలవంతంగా బస్సు నుంచి ఆమెను దింపేశారు. స్టేషన్ ఎస్ఐ ఈ ఘటనపై విచారిస్తాం అని చెబితే బస్సులో ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫైనల్ గా ఆమె మద్యం తాగి బస్సు ఎక్కింది అని నిర్ధారించారు. ఇలాంటి ప్రవర్తన మరొకసారి జరిగితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కొంచెం సేపటికి ఆమెకి తాగిన మత్తు దిగింది. చివరికి ఆమె చేసిన రచ్చ తెలుసుకుని క్షమించమని పోలీసులను కోరింది కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.
End of Article