Ads
పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు.
Video Advertisement
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాటపై ట్రోలింగ్ మొదలయ్యింది. మగవాళ్లని తిడుతున్నట్టుగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పాట రాసిన చంద్రబోస్ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. “ఇలాంటి పాట ఎలా రాసారు?” అంటూ చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా, పాటలో మగవాళ్లని తిట్టారు అని కేస్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో రచయిత చంద్రబోస్ దీనిపై స్పందించారు. బీబీసీ న్యూస్ తెలుగు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాటపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ గురించి మాట్లాడారు చంద్రబోస్. “ఈ పాట ట్యూన్ 4 సంవత్సరాల క్రితమే వచ్చింది. మధ్యలో చరణంలో వంకర బుద్ధి అనే ఒక పదం వచ్చింది. ఈ పదంతోనే పాట మొత్తం ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ పాట ఊపిరి పోసుకోవడానికి కారణమయ్యింది” అని పాట వెనక ఉన్న కారణం గురించి చెప్పారు.
“ఇలాంటి మెసేజ్ ఉన్న పాటని కమర్షియల్ గా చూపించాల్సిన అవసరం ఏంటి?” అని అడగగా, అందుకు చంద్రబోస్, “ఇప్పుడు ఉన్న ఈ కమర్షియల్ యుగంలో పాటని ఎక్కువ మంది విని, ఆదరించాలి అనుకోవడంలో తప్పు లేదు కదా?” అని అన్నారు. ఈ పాటపై మాధవి లతతో పాటు ఇంకా కొంత మంది సెలబ్రిటీస్ పాటకి మద్దతు ఇస్తూ తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.
End of Article