Home Bigg Boss 4 Telugu Ariyana Glory : “పుష్ప” ఐటెం సాంగ్‌కి అరియానా డ్యాన్స్..! వీడియో వైరల్..!

Ariyana Glory : “పుష్ప” ఐటెం సాంగ్‌కి అరియానా డ్యాన్స్..! వీడియో వైరల్..!

by Mohana Priya

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ariyana dance for pushpa iten song goes viral

ఈ పాట పై బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ అరియానా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరియానా ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల విడుదలైన అనుభవించు రాజా సినిమాలో కూడా నటించారు. ఇవి మాత్రమే కాకుండా, ఇంకా కొన్ని సినిమాల్లో కూడా అరియానా నటిస్తున్నారు అని సమాచారం.

watch video :

https://www.instagram.com/reel/CXZB3-kgZN3/?utm_source=ig_web_copy_link

You may also like