Ads
పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.
Video Advertisement
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే. మొదటి భాగమైన పుష్ప – ది రైజ్ డిసెంబర్ 17వ తేదిన విడుదల అయ్యింది.
పుష్ప సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి పాటలు కూడా ముఖ్య కారణం అయ్యాయి. ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటకి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ పాటకి అడిషనల్ కొరియోగ్రాఫర్‌గా పోలాకి విజయ్ పని చేసారు.
ఈ సందర్బంగా విజయ్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని షేర్ చేసారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్‌లోని ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసారు విజయ్. అందులో తను బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ అని చెప్పారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పాటకి కొరియోగ్రఫీ చేయడం చాలా ఆనందంగా ఉంది అని రాసారు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు పుష్ప సినిమా బృందానికి కూడా ధన్యవాదాలు చెప్పారు విజయ్. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా విజయ్‌ని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article