Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.
Video Advertisement
అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. కొంత మంది మాత్రం, “అసలు సినిమా ఇంకా చాలా బాగుంటుంది అని ఊహించామని” అంటున్నారు. అయితే, సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ గెటప్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇవి మాత్రమే కాకుండా కూడా చాలా సీన్స్, పాటలకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే సినిమాలో అల్లు అర్జున్ ఒక పెద్దాయనని కొట్టుకుంటూ తీసుకెళ్లే సీన్ ఒకటి ఉంది.
వాళ్లకి అప్పులిచ్చిన పెద్దాయన వచ్చి తప్పుగా మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ అతనిని కొట్టి తరువాత ఆ ఊర్లో ఉన్న కొంత మందికి క్షమాపణ చెప్పిస్తారు. కానీ ఆ సీన్ మాత్రం సినిమాలో లేదు. అయితే ఈ సీన్ ఓవర్సీస్ లో విడుదలైన వెర్షన్ లో ఉన్నట్టు సమాచారం. ఇలాగే నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో కూడా జరిగింది. వెన్నెల కిషోర్ దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి పెయింటింగ్ కొనుక్కుంటారు. కానీ ఆ సీన్ కూడా ఓవర్సీస్ వెర్షన్ లో ఉంది కానీ భారతదేశంలో విడుదలైన వెర్షన్ లో లేదు.
End of Article