Ads
ఎన్నో ఆశలతో కోడలు అత్త వారి ఇంటికి వెళ్తుంది. కానీ ఒక్కొక్కసారి పెట్టుకున్న ఆ ఆశలు కుప్పకూలిపోతుంటాయి. అనుకున్నవన్నీ చెదిరిపోయి దుఃఖంలో మునిగిపోవాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి చాలా మంది ఆడవాళ్ళకి ఈ కాలంలో కూడా వస్తోంది. 22 సంవత్సరాల వయస్సు ఉన్న ఈమె కూడా అలానే కష్టాలను చూడాల్సి వచ్చింది.
Video Advertisement
కోటి ఆశలతో అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టింది. కానీ అవన్నీ కూడా ఒక్కసారే కుప్పకూలిపోయాయి. అసలు ఏమైంది అనే విషయానికి వస్తే… పెళ్లయి 19 రోజులు అయింది అంతే అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనపడింది. కర్ణాటకలోని హసన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
హసన్ జిల్లా అరకలగుడు తాలూకా హొలలగుడు గ్రామానికి చెందిన ఫిజా ఖానుమ్ (22) కి తల్లిదండ్రులు పెళ్ళి నిశ్చయించారు. డిసెంబర్ 2న పెళ్లి జరిపించారు. షాజిల్ మహ్మద్ అనే వ్యక్తి ఆమెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. భర్తతో కలిసి పెళ్లయిన తర్వాత ఆమె టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది.
టూర్ కి వెళ్లి వచ్చాక ఏమైందో తెలియదు కానీ ఆనందంగా ఉండాల్సిన ఆమె పెళ్ళైన 19వ రోజే విగతజీవిగా అనుమానాస్పద స్థితిలో కనబడింది. ఆమె స్నానానికి వెళ్ళిన సమయంలో గ్యాస్ గీజర్ ఆన్ చేసి తలుపు మూసారని… కావాలనే ఇదంతా చేసి ఆమెను చంపేశారని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.
ఇలా చేయడానికి కారణం అదనపు కట్నం అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఇంత ఘోరానికి పాల్పడిన భర్త షాజిల్ మహ్మద్, అత్తా, మరిది పై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ఆమె మృతి దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
End of Article