Ads
కె విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన సినిమాలని తెరకెక్కించారు. పైగా మంచి దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అన్న గారి గురించి ఏం చెప్పాలి. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. జానపద, సాంఘిక, పౌరాణిక వంటి ఎన్నో సినిమాల్లో నటించి తిరుగు లేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
Video Advertisement
అయితే కె విశ్వనాధ్ గారికి ఎన్టీఆర్ గారికి సినిమాల్లోకి రాక ముందు నుండి కూడా పరిచయం ఉండేదట. బయట వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కలిసొచ్చిన అదృష్టం.
ఆ తర్వాత నిండు హృదయాలు సినిమా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చింది. అలానే నిండు దంపతులు, చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చింది. అయితే చిన్ననాటి స్నేహితులు సినిమా సమయంలో ఎన్టీఆర్ కె.విశ్వనాథ్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణం చేత అప్పటి నుండి వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. చిన్ననాటి స్నేహితులు సినిమా వల్లనే వీళ్ళు విడిపోయారని అంటుంటారు. అలానే అదే వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ఆఖరి సినిమా.
End of Article