Ads
మహిళలు భర్త చేతిలో మోసపోవడంని మనం చూస్తూ ఉంటాము. కానీ భార్య చేతిలో మోసపోయిన భర్త గురించి అరుదుగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నవరసాలు పండించి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది భార్య.
Video Advertisement
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని కోయంబత్తూర్ కనువాయి ప్రాంతానికి చెందిన విగ్నేష్ అనే ఒక అతనితో వివాహం అయింది. పెద్దల దగ్గర ఉండి వివాహం చేశారు. ఇప్పటికే పెళ్లయి రెండు నెలలు అవుతోంది. అయితే భార్య ప్రవర్తనలో ఎన్నో మార్పులు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే గతంలో యామినికి శివ కుమార్ అనే వ్యక్తి తో వివాహం అయింది. అతనితో ఆమె ఉంటూనే మరో వివాహం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే అటు పెద్దలు కానీ ఇటు విగ్నేష్ కానీ కనిపెట్టలేకపోయారు. ఇంకేముంది ఒక రోజు చూసుకుని నగలు డబ్బులు అన్ని సర్దుకుని భర్తకు, అత్తమామలకు షాక్ ఇచ్చింది ఈ యువతి. డబ్బు, నగలు అన్నీ తీసుకుని మొదటి భర్త శివకుమార్ దగ్గరికి వెళ్లి పోయింది.
ఆమె కోసం ఎంత వెతికినా జాడ తెలియలేదు. పైగా ఆమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏం చేయాలో తోచక పోలీసులకు ఫిర్యాదు చేశాడు విగ్నేష్. దీంతో విచారణ లో ఆమెకు ముందే పెళ్లి అయిందని.. ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లి పోయిందని తెలిసింది. పోలీసులు యామిని తో పాటు ఆమె తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేశారు. డబ్బు కోసం ఇంతకి తెగించిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
End of Article