Home Filmy Adda ఈ నలుగురు హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్‌లో… ఈ “కామన్ పాయింట్” గమనించారా..?

ఈ నలుగురు హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్‌లో… ఈ “కామన్ పాయింట్” గమనించారా..?

by Mohana Priya

పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకి సమంతతో పాటు ఇంద్రావతి చౌహాన్ వాయిస్, అలాగే గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ కూడా ఒక హైలైట్‌గా నిలిచాయి.

సమంత కంటే ముందు చాలా మంది హీరోయిన్లు ఇలా స్పెషల్ సాంగ్స్ లో నటించారు. ఇలా ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో నటించడం అనేది కొన్ని సంవత్సరాల నుండి వస్తోంది. గత కొంత కాలం నుండి చూస్తే, అల్లుడు శీను సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

common point between these four special songs

ఆ తర్వాత తమన్నా రెండు, మూడు సినిమాల్లో అలాగే స్పెషల్ సాంగ్ లో కనిపించారు. జనతా గ్యారేజ్ సినిమా కోసం కాజల్ కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అసలు సినిమా విడుదల అయినప్పుడు కాజల్ పక్కా లోకల్ పాట ఎలా ఉంటుందో చూడండి కోసమే థియేటర్లకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత రంగస్థలం సినిమా కోసం పూజ హెగ్డే కూడా జిగేల్ రాణి అనే ఒక ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

common point between these four special songs

ఇదే స్టైల్ లో సమంత కూడా పుష్ప సినిమా కోసం ఊ అంటావా ఊ ఊ అంటావా పాట చేశారు. అయితే, ఈ నలుగురు హీరోయిన్లు నటించిన మొదటి స్పెషల్ సాంగ్స్ కి ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ నాలుగు పాటలు దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నాలుగు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఊ అంటావా ఊ ఊ అంటావా పాట ట్రెండింగ్‌లో ఉంది.

You may also like